ODI World Cup 2023 : వరల్డ్ కప్ ఆఖరి డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. పుణేలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకున్నాడు. నామమాత్రమైన ఈ పోరులో మాక్స్వెల్, మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతినిచ్చారు. వీళ్ల స్థానంలో స్మిత్, సియాన్ అబాట్ జట్టులోకి వచ్చారు. షకీబుల్ హసన్ గాయపడడంతో శాంటో బంగ్లాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సెమీస్ రేసు నుంచి ముందే తప్పుకున్న బంగ్లా టోర్నీని విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది.
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబూషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), స్టోయినిస్, సియాన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హేజిల్‌వుడ్.
బంగ్లాదేశ్ : తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీం(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహెదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్.