World Cup 2023 : వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఆరు ఓవర్లకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. తొలి ఓవర్లోనే తెంబ బవుమా(0)ను మిచెల్ స్టార్క్ గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. దాంతో, బవుమా సేన ఒత్తిడిలోకి పడిపోయింది.
అనంతరం హేజిల్‌వుడ్ అద్భుత బంతితో క్వింటన్ డికాక్(3)ను ఔట్ చేశాడు. దాంతో, సఫారీ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం డస్సెన్(4), మర్క్రమ్(1) ఆడుతున్నారు. ఓవర్లకు స్కోర్.. 10/2.
It’s been all Australia so far!#CWC23 #SAvAUS LIVE ▶️ https://t.co/NKJxPQslQa pic.twitter.com/TYBvuwgZoZ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2023