Gukesh | స్టార్ నటుడు రజనీకాంత్ (Rajinikanth)ను భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ చాంపియన్ డి గుకేశ్ (D Gukesh) కలిశారు. రజనీ ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లిన గుకేశ్ తలైవాను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను గ్రాండ్ మాస్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. విలువైన సమయాన్ని తనకోసం వెచ్చించిన రజనీకాంత్‌కు గుకేశ్ ధన్యవాదాలు తెలిపారు. మరో హీరో శివకార్తికేయన్‌ను కూడా గుకేశ్ కలిశారు.
World Chess Champion D Gukesh tweeted, “Thanks, Superstar Rajinikanth sir for your warm wishes and inviting, spending time and sharing your wisdom with us”
(Pic source – D Gukesh’s twitter handle) pic.twitter.com/FJI5RiOHQ6
— ANI (@ANI) December 26, 2024
ప్రపంచ చెస్ చాంపియన్‌గా 18 ఏళ్ల గుకేశ్ (Chess Champion Gukesh) అవతరించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్‌ను ఓడించి అతను విశ్వ విజేతగా నిలిచాడు. ఆ టైటిల్‌ను అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
Also Read..
Sonu Sood | నాకు సీఎం ఆఫర్ వచ్చింది.. తిరస్కరించా : సోను సూద్
AAP | ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను పంపించేందుకు ఆప్ ప్రయత్నాలు..!
Heavy Snow | ఉత్తరాదిపై మంచు దుప్పటి.. హిమాచల్‌కు ఆరెంజ్ అలర్ట్.. 226 రోడ్లు మూసివేత