AAP | ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను పంపించేందుకు ఆప్ ప్రయత్నాలు..!
AAP | ప్రతిపక్ష ఇండియా కూటమిలో (INDIA bloc) విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ (Congress), ఆప్ (AAP) మధ్య వైరం రోజురోజుకూ పెరిగిపోతోంది.
AAP | ప్రతిపక్ష ఇండియా కూటమిలో (INDIA bloc) విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ (Congress), ఆప్ (AAP) మధ్య వైరం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలతో ఈ వైరం మరింత ముదురుతోంది. తాజాగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ హస్తం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు ఆప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కూటమి నుంచి కాంగ్రెస్‌ను బయటకు పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించేందుకు ఆప్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ‘ఎన్నికల్లో విజయం సాధించి పెట్టలేని నాయకుడిని మనం ఇంకా ఎంతకాలం భరించాలి’ అన్న ధోరణి ఆ పార్టీల్లో ఇటీవల అధికమైంది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే తామూ మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్‌వాదీ, ఎన్సీపీ (శరద్చంద్ర పవార్), శివసేన (యూబీటీ) సహా పలు మిత్రపక్ష పార్టీలు దీదీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
Also Read..
Heavy Snow | ఉత్తరాదిపై మంచు దుప్పటి.. హిమాచల్‌కు ఆరెంజ్ అలర్ట్.. 226 రోడ్లు మూసివేత
IRCTC Down | ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల అసహనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

