గ్రేటర్ నోయిడా: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్లు స్వీటీ బూర, పూజరాణి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన 81కిలోల బౌట్లో స్వీటీ 4-1తో అల్ఫియా(ఆర్ఎస్పీబీ) పై అలవోక విజయం సాధించింది.
అయితే స్వీటీకి అల్ఫియా దీటైన పోటీనిచ్చింది. మరోవైపు 75కిలోల బౌట్లో పూజ 5-0తో రేణు(నాగాలాండ్) ను చిత్తుగా ఓడించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన పూజ.. పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది.