న్యూఢిల్లీ : బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత యువ బాక్సర్ హితేశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల 70కిలోల సెమీస్ బౌట్లో హితేశ్ 5-0 తేడాతో మకాన్ ట్రారోరె (ఫ్రాన్స్)పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హితేశ్.. పదునైన పంచ్‌లతో చెలరేగాడు. తద్వారా టైటిల్ పోరుకు అర్హత సాధించిన తొలి భారత బాక్సర్‌గా హితేశ్ నిలిచాడు. శనివారం జరిగే తుది పోరులో ఇంగ్లండ్ బాక్సర్ ఒడెల్ కమారతో హితేశ్ తలపడనున్నాడు. మరోవైపు 50కిలోల విభాగం సెమీస్‌లో జదుమణి సింగ్ 2-3తో అసిల్‌బెక్ జలీలోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడగా, విశాల్ (90కి), సచిన్ (60కి) పరాజయం పాలయ్యారు.