అయిజ, ఫిబ్రవరి 28 : పాలుమూరులో మహిళల కబడ్డీ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో మహాశివరాత్రి, రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు పురస్కరించుకొని గురువారం నిర్వహించిన మహిళల కబడ్డీ పోటీలకు వివిధ రాష్ర్టాల నుంచి 15 జట్లు వచ్చాయి.
కబడ్డీ పోటీలు అర్ధరాత్రి వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించారు. ఈ పోటీల్లో హర్యానా జట్టు విజేతగా నిలువగా, తమిళనాడు జట్టు రన్నరప్‌గా, తమిళనాడు జీఎల్ఎస్ జట్టు మూడో స్థానం, బెంగుళూరు ‘ఏ’ నాలుగో స్థానం, బెంగుళూరు ‘బీ’ జట్టు ఐదో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులతోపాటు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.