Woman Wrestler Jumps From Fort | ముగ్గురు పిల్లలతో కలిసి.. కోట పైనుంచి లోయలోకి దూకి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
Woman Wrestler Jumps From Fort | జాతీయస్థాయి మహిళా రెజ్లర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చారిత్రక కోట పైనుంచి లోయలోకి దూకారు. మహిళా రెజ్లర్, ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది.
ముంబై: జాతీయస్థాయి మహిళా రెజ్లర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చారిత్రక కోట పైనుంచి లోయలోకి దూకారు. మహిళా రెజ్లర్, ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది. (Woman Wrestler Jumps From Fort) మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. క్రీడా రంగంలో ‘మహారాష్ట్ర ఆడపులి’గా ప్రసిద్ధి చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అయిన 30 ఏళ్ల అశ్విని మనోహర్ పాల్, గురువారం మధ్యాహ్నం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆ జిల్లాలోని చారిత్రక నల్దుర్గ్ కోట వద్దకు చేరుకున్నారు. కుమారుడు, ఇద్దరు కవల కుమార్తెలతో కలిసి కోట పైనుంచి వంద అడుగుల లోతైన లోయలోకి ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, అశ్విని, ఐదున్నరేళ్ల వయస్సున్న కుమారుడు అజింక్య అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు కవల కుమార్తెల్లో ఒకరైన రెండేళ్ల వయస్సున్న క్రాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో కవల కుమార్తె వీర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ధారాశివ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్‌పై ఆ చిన్నారి చికిత్స పొందుతున్నది. అయితే తన కుమార్తె అశ్వినిని ఆమె భర్త, అత్తమామలు నిరంతరం మానసికంగానూ, శారీరకంగానూ వేధించినట్లు ఆమె తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు అత్యుత్తమ జాతీయస్థాయి మహిళా రెజ్లర్‌గా అశ్విని ప్రసిద్ధి చెందారు. క్రీడా రంగంలో ‘మహారాష్ట్ర ఆడపులి’గా ఆమె పేరు పొందారు. 2007లో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన జాతీయ రెజ్లింగ్ పోటీలో అగ్రస్థానంలో నిలిచారు. అనేక పతకాలు సాధించారు. 2008లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, 2009లో తమిళనాడులోని చెన్నైలో జరిగిన జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భోపాల్, కాన్పూర్, హర్యానా, పూణే, కన్యాకుమారి, లక్నోలలో జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలలో అశ్విని రాణించారు. ఆమె తన కెరీర్ మొత్తంలో ఐదు స్వర్ణ, ఆరు రజత పతకాలు గెలుచుకున్నారు. అయితే అశ్విని తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటం క్రీడా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

