లండన్: వింబుల్డన్(Wimbledon) గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు చెందిన ప్రైజ్‌మనీని పెంచేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 50 మిలియన్ల పౌండ్ల(రూ.534 కోట్లు) ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. సింగిల్స్ ఛాంపియన్‌కు 2.7 మిలియన్ల పౌండ్లు దక్కనున్నాయి. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ప్రకటించింది. గత ఏడాది టోర్నీతో పోలిస్తే ఈ ఏడాది ప్రైజ్‌మనీ సుమారు 11.9 శాతం పెంచేశారు. అంటే ఇది సుమారు 5.3 మిలియన్ల పౌండ్లు ఎక్కువ అని అధికారులు పేర్కొన్నారు. టోర్నీ ఫస్ట్ రౌండ్లో ఓడిన ఆటగాడికి 60 వేల పౌండ్లు ఇవ్వనున్నారు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 1 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నది.