Nitish Reddy | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో తెలుగు తేజం నితీశ్‌రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు జట్టు బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ హింట్స్ ఇచ్చాడు. నితీశ్ తన ఆటతీరును తొలిసారిగా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో నితీశ్‌రెడ్డి బౌలింగ్‌పై మోర్కెల్ ప్రశంసలు కురిపించాడు. తాము దృష్టిసారిస్తున్న యువ ఆటగాళ్లలో నితీశ్ రెడ్డి ఒకడని.. అతనికి ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉందని చెప్పాడు. మనం ఊహించిన దాని కంటే గొప్పగా, వేగంగా నితీశ్ బ్యాటింగ్ చేయగలడని.. ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై ఉపయుక్తమైన బౌలర్ కాగల సత్తా నితీశ్‌కు ఉందన్నాడు.
వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడని.. జట్టులో ఆల్‌రౌండర్ స్థానాన్ని నితీశ్ రెడ్డితో భర్తీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో పేసర్లపై భారాన్ని తగ్గించే పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుందని మోర్కెల్ చెప్పుకొచ్చాడు. ఇక అతన్ని ఎలాఉపయోగించుకుంటాడనేది కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్లో నితీశ్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. నితీశ్ 23 ఫస్ట్ క్లాస్ మ్యాచులు మాత్రమే ఆడాడు. పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో పరుగులు చేసే సామర్థ్యం ఉన్నది. ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇండియా-ఏ జట్టులో నితీశ్ సభ్యుడు. ఆస్ట్రేలియాతో రెండు అనధికారిక టెస్టులు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 31 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
తొలి టెస్టు మ్యాచ్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లకు భారత్ అవకాశం ఇస్తుందని, ప్లేయింగ్-11లో ఒక స్పిన్నర్, ఒక ఆల్ రౌండర్ చోటు దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. నితీశ్ రెడ్డిని నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా తీసుకుంటే.. టీమ్ మేనేజ్మెంట్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడనున్నది. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ శుక్రవారం మొదలుకానున్నది. తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.