IPL 2025 : భారీ ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్(LSG) తడబడుతోంది. పవర్ ప్లే తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తర్వాత విల్ జాక్స్(2-7) తొలి బంతికే డేంజరస్ నికోలస్ పూరన్(27)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్వీప్ షాట్ ఆడబోయిన రిషభ్ పంత్(4) స్లిప్‌లో కరణ్ శర్మకు సులువైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో, 64 వద్ద లక్నో మూడో వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ మిచెల్ మార్ష్(22), ఆయుష్ బదొని(2)లు ఆడుతున్నారు. 7 ఓవర్లకు లక్నో స్కోర్.. 67-3.
ముంబై నిర్దేశించిన 216 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్(22), ఎడెన్ మర్క్రమ్(9) ధాటిగా ఆడారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు మర్క్రమ్. అయితే.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. 18 పరుగుల వద్ద మొదటి వికెట్ పడినా లక్నో స్కోర్ వేగం తగ్గలేదు.
𝐇𝐚𝐭-𝐭𝐫𝐢𝐜𝐤 𝐨𝐟 𝐒𝐢𝐱𝐞𝐬 🤩
Nicholas Pooran left no half measures with a quick cameo of 27(15) 👏
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @nicholas_47 pic.twitter.com/o0sX0APxoo
— IndianPremierLeague (@IPL) April 27, 2025
నికోలస్ పూరన్(27) తన మార్క్ విధ్వంసాన్ని కొనసాగించాడు. దీపక్ చాహర్ వేసిన 6వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. దాంతో, లక్నో వికెట్ నష్టానికి 60 పరుగులు స్కోర్ చేసింది. కానీ, ఆ తర్వాత బంతి అందుకున్న విల్ జాక్స్(2-7) డేంజరస్ పూరన్, పంత్(4)లను పెవిలియన్ చేర్చాడు.