బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. టాస్ గెలిచిన జింబాబ్వే.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ వియాన్ ముల్దర్ (259 బంతుల్లో 264 నాటౌట్, 34ఫోర్లు, 3సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో విజృంభించాడు.
ముల్దర్‌కు తోడు డేవిడ్ బెడింగ్హామ్ (82), ప్రిటోరియస్(78) అర్ధసెంచరీలతో తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 465 పరుగులు చేసింది. ముల్దర్, బ్రెవిస్ (15) క్రీజులో ఉన్నారు. చివాంగ(2/85) రెండు వికెట్లు తీశాడు.