భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన బ్రూక్స్.. డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తక్కువ ఎత్తులో వచ్చిన బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్స్‌లో ఉన్న ధవన్ వైపు వెళ్లింది. లో క్యాచ్‌ను ధవన్ చక్కగా అందుకోవడంతో బ్రూక్స్ వెనుతిరిగాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే చాహల్ మరో వికెట్ తీశాడు. ఫామ్‌లో ఉన్న బ్రాండన్ కింగ్ (0)ను డకౌట్ చేశాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కింగ్ తడబడ్డాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని ధవన్ క్యాచ్ పట్టేశాడు. దీంతో విండీస్ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే 100వ వన్డే ఆడుతున్న షాయి హోప్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.