భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టుకు శుభారొంభం దక్కలేదు. 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టును అర్షదీప్ సింగ్ మొదటి దెబ్బకొట్టాడు. కైల్ మేయర్స్ (15)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే జడేజా బౌలింగ్‌లో జేసన్ హోల్డర్ (0) డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.
అయితే షామ్రా బ్రూక్స్ (20)కు జతకలిసిన కెప్టెన్ నికోలస్ పూరన్ (5 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే భువనేశ్వర్ ఈ జోడీని దెబ్బతీశాడు. ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అతను రెండో బంతికే బ్రూక్స్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆ జట్టు ఆరు ఓవర్లలో 42/3 స్కోరుతో కష్టాల్లో పడింది.