విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడుతోంది. ధవన్ (97) అవుటైన కాసేపటికే సెటిల్డ్ బ్యారట్ శ్రేయాస్ అయ్యర్ (54) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.
హొసేన్ వేసిన బంతిని కట్ చేసేందుకు సూర్య ప్రయత్నించాడు. అయితే అతను ఊహించిన దానికన్నా ఎక్కువ బౌన్స్ అవడంతో.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి హుడా కూడా అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు.
హొసేన్ వేసిన బంతిని హుడా స్వీప్ చేశాడు. ఫ్లాట్‌గా వచ్చిన బంతిని మోతీ సరిగా అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో ముందుకు దూకి మరీ క్యాచ్ అందుకోబోయాడు కానీ.. బంతి అతని చేతుల్లో నిలవలేదు. దీంతో హుడా బతికిపోయాడు.