తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. శిఖర్ ధవన్ (97), గిల్ (64) శుభారంభం అందించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన టీమిండియా.. గిల్ అవుటైన తర్వాత నెమ్మదించింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ధవన్, అయ్యర్ చాలా నిదానంగా ఆడారు. అయితే 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్స్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు ధవన్ వెనుతిరిగాడు.
ఆ తర్వాత కాసేపటికే మోతీ బౌలింగ్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్ (54) పెవిలియన్ చేరాడు. ఫుల్ లెంగ్త్ బాల్‌ను డ్రైవ్ చేసేందుకు అయ్యర్ ప్రయత్నించగా.. కవర్స్‌లో ఉన్న పూరన్ ఒంటి చేత్తో అదిరిపోయే క్యాచ్ అందుకొని అయ్యర్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత జట్టు 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులతో నిలిచింది.