విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి ధావన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మోతీ వేసిన 34వ ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదిన ధావన్.. 97 పరుగులతో నిలిచాడు. తర్వాతి బంతికే మరో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధవన్ విఫలమయ్యాడు. తనకు దూరంగా వెళ్తున్న బంతిని గ్యాప్‌లోకి ఆడేందుకు ధవన్ ప్రయత్నించాడు.
అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బ్రూక్స్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో ధవన్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీంతో మూడు పరుగులతో శతకం మిస్ చేసుకున్నాడు ధవన్. కెప్టెన్ అవుటవడంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
💔
Captain @SDhawan25 falls three short of his century as he departs after scoring a fine 97.
Live – https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/Z47MkSZIPb
— BCCI (@BCCI) July 22, 2022