కొలంబో: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు బ్రేక్ పడింది. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసిన టెస్టులో నాలుగో రోజైన శనివారం విరా మం ప్రకటించారు. తొలుత షెడ్యూల్లో ప్రకటించినట్లే మూడు రోజుల తర్వాత మ్యాచ్కు విరామమిచ్చారు. శనివారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా బ్రేక్ ఇచ్చినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఆదివారం, సోమవారం మిగిలిన రెండు రోజుల ఆట కొనసాగనుంది.