ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసింది ఎవరు..? రిటైరైనా ఇప్పటికీ గుర్తొచ్చే పేరు పాకిస్తాన్ స్పీడ్ గుర్రం షోయభ్ అక్తరే. 2002 లో అక్తర్.. న్యూజిలాండ్ తో ఓ మ్యాచ్ లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. ఇక టీమిండియా యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. అక్తర్ రికార్డును బద్దలు కొట్టడానికి సాధన చేస్తున్నాడు. ఐపీఎల్ లో అతడు గంటకు 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. కానీ ఇప్పుడు వీళ్లిద్దరినీ కాదంటూ ఫాస్టెస్ట్ బాల్ వేశాడు టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్.
అవును. తాజాగా ఐర్లాండ్ తో ఆదివారం జరిగిన తొలి టీ20లో అతడు.. ఏకంగా గంటకు 201 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. దీంతో అక్తర్, ఉమ్రాన్ మాలిక్, షాన్ టైట్ (న్యూజిలాండ్)ల రికార్డులు బద్దలయ్యాయి. అదేంటి భువీ వేసే బౌలింగ్ స్పీడ్ మహా అయితే గంటకు 140 కి.మీ. దాటదు కదా. 201 ఎలా పడింది అనుకుంటున్నారు కదా. మీకొచ్చిన డౌటానుమానం కరెక్టే..
భువీ వేసే బౌలింగ్ స్పీడ్ కూడా అంతే. వేగం కంటే టెక్నిక్ తో బౌలింగ్ చేసే భువీ.. ఈ మ్యాచ్ లో కూడా అదే చేశాడు. కానీ స్పీడ్ గన్ ఎర్రర్ వల్ల ఈ తప్పిదం జరిగింది. భువీ వేసిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతిని స్పీడ్ గన్ ఏకంగా 125 ఎంపీహెచ్ (గంటకు 201 కి.మీ) గా చూపించింది. దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తించి ఐర్లాండ్ క్రికెట్ ను ఆటాడుకుంటున్నారు.
ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘షోయభ్ అక్తర్, ఉమ్రాన్ మాలిక్ ఎవరు..? క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ వేసింది భువనేశ్వర్ కుమార్. ఇది ప్రపంచ రికార్డు. ఇదే సాక్ష్యం..’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Shoaib Akhtar, Umran Malik who??? Bhuvi just bowled the fastest ball ever.🤣🤣 Real pic, just took ss pic.twitter.com/2wDDDJQ6gK
— Usama Kareem (@UsamaKarem2) June 26, 2022
WORLD RECORD❗
bhuvneshwar kumar delivered a ball at 201 KMPH. Fastest ball of cricket history. Sheering pace from bhuvi 🔥#IREvIND #indvsire pic.twitter.com/sz3JDz1Vzu
— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022