అల్జీరియా : అల్జీరియా స్టార్ బాక్సర్ ఇమానె కెలిఫ్ మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో మెరిసిన కెలిఫ్ లింగ నిర్ధారణపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లింగ నిర్ధారణపై మెడికల్ రిపోర్ట్లు సోషల్‌మీడియాలో లీక్ కావడంతో క్రీడా వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. పారిస్‌లోని క్రెమ్లిన్ దవాఖాన నివేదిక ప్రకారం ఆమె శరీరంలో పురుష లక్షణాలైన ఎక్స్, వై క్రొమోజోమ్లు ఉన్నట్లు తేలింది. దీనికి తోడు ఎమ్ఆర్ఐ రిపోర్ట్‌లో చిన్నసైజ్లో పురుషాంగం ఉన్నట్లు బయటపడింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సోషల్‌మీడియాలో రిపోర్టులపై పలువురు ఇమానెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తన పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తుచేసిన ఇమానె కెలిఫ్కు కొందరు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.