న్యూఢిల్లీ: భారత యువ ఫుట్బాల్ ప్లేయర్ మనీషా కల్యాణ్.. అరుదైన ఘనత సాధించింది. యూఈఎఫ్ఏ మహిళల చాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన తొలి భారత మహిళా ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. భారత జట్టు తరఫున చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న మనీషా..చాంపియన్స్ లీగ్లో గురువారం అపోలో మహిళల ఫుట్బాల్ క్లబ్ తరఫున అరంగేట్రం చేసింది.