మెల్బోర్న్: సహచర ఆటగాడు రఫేల్ నాదల్ గాయం కారణంగా సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించగా.. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ టైటిల్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించిన జొకో.. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 6-1, 6-7 (5/7), 6-2, 6-0తో కొకాడ్పై విజయం సాధించాడు.
తొలి సెట్‌తో పాటు చివరి రెండు సెట్లలో విజృంభించిన జొకోవిచ్‌కు.. రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. రాడ్ లీవర్ వేదికలో జరిగిన పోరులో జొకోవిచ్ 9 ఏస్‌లతో విజృంభించాడు. 21 బ్రేక్ పాయింట్లలో ఏడింటిని కాచుకున్న నొవాక్.. 145 పాయింట్లు నెగ్గి.. మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో అగట్, దిమిత్రివ్, రూబ్లెవ్ విజయాలు సాధించగా.. రెండో సీడ్ కాస్పెవ్ రూడ్ తో పాటు అలెగ్జాండర్ జ్వెరెవ్, స్వార్ట్మన్ పరాజయాలతో ఇంటిదారి పట్టారు. మహిళల విభాగంలో వొండ్రుసోవా, మెన్కిచ్, గార్సియా, ప్లిస్కోవా, సబలెంక విజయాలు నమోదు చేసుకున్నారు.
ఆస్ట్రేలియా ఓపెన్‌తో ప్రొఫెషనల్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ముందే ప్రకటించిన హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్లో అలవోక విజయం నమోదు చేసుకుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-డానియిల్లా జోడీ 6-2, 7-5తో గాల్ఫీ-పెరా ద్వయంపై గెలిచింది.