పారిస్: ఫ్రాన్స్‌లో జీ-7 దేశాల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవియన్ లెస్ బెయిన్ నగరంలో జరుగుతున్న ఆ మీటింగ్‌లో జీ7 దేశాల నేతలు గ్రూపు ఫోటో దిగారు. ఆ సమయంలో ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ(Italian PM Meloni) ముచ్చటించుకున్నారు. ఆ కాస్త సమయంలో సోషల్ మీడియా గుర్తించి మాట్లాడుకున్నారు. మెలోనిని గ్రీట్ చేసిన తర్వాత మోదీ ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మనం పాపులర్ అయ్యామన్న విషయాన్ని ఆమెతో మోదీ చెప్పారు. ప్రధాని మోదీ మాటలకు మెలోనీ రియాక్ట్ అవుతూ.. అవును, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మనం ఫేమస్ జంట అంటూ కామెంట్ చేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నేతలు మాట్లాడుకుంటున్నారు, కానీ మాటలు మాత్రం స్పష్టంగా వినబడడం లేదు.
వాస్తవానికి ప్రధాని మోదీ కొన్ని నెలల క్రితం ఇటలీలో పర్యటించారు. రోమ్‌లో ఉన్న చరిత్రక ప్రదేశాల్లో మెలోనీతో కలిసి టూర్ చేశారు. ఆ తర్వాత ప్రధాని మెలోనీకి మోదీ ఓ గిఫ్ట్ ఇచ్చారు. మెలోడీ చాక్లెట్ ప్యాక్‌ను ఆమెకు అందించారు. మోదీ ఇచ్చిన గిఫ్ట్‌ను తన సోషల్ మీడియాలో మెలోనీ షేర్ చేసి థ్యాంక్స్ చెప్పింది. ఇక ఆ భేటీ తర్వాత మెలోడీ అన్న పదం ఇంటర్నెట్లో పాపులర్ అయ్యింది. మెలోనీ, మోదీ కలిస్తే మెలోడీ అవుతుందని జోకులు పేలాయి. ఆ ఇద్దరు నేతలపై ఆన్లైన్లో మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి.
Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN
— Jash (@jeetcasm) June 16, 2026