గురుగ్రామ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ యువ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. సోషల్‌మీడియాలో రీల్స్ చేస్తున్న కారణంగా తండ్రి దీపక్ చేతిలో రాధిక హత్యకు గురైందన్న వార్తను ఉటంకిస్తూ పోలీసులు మరో విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. టెన్నిస్ అకాడమీ విషయంలో రాధికకు తండ్రి దీపక్ మధ్య ఏర్పడిన వివాదం హత్యకు దారితీసిందని పోలీస్ అధికారులు శుక్రవారం పేర్కొన్నారు.
అకాడమీ ద్వారా కూతురు సంపాదించే సొమ్ముతో జీవితం గడుపుతున్నాడన్న ఇరుగుపొరుగు వాళ్ల సూటిపోటి మాటలకు విరక్తి చెందిన దీపక్.. ఈ దారుణానికి ఒడికట్టినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ యశ్వంత్‌యాదవ్ తెలిపాడు. ‘అకాడమీ బంద్ చేయాలంటూ తండ్రి కోరినా.. రాధిక వినలేదు. దీంతో విసుగెత్తిన దీపక్ లైసెన్స్డ్ రివాల్వర్‌తో ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది’ అని వివరించాడు. అయితే ఈ కేసులో రాధిక వాడిన ఫోన్‌తో పాటు సోషల్‌మీడియా అకౌంట్లపై పోలీసులు దృష్టి సారించారు.