Oval Chasing Record : ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం(Oval Stadium) వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్(India), ఆస్ట్రేలియా(Australia).. ఈ రెండింటిలో టెస్టు గద(Mace)ను అందుకునే జట్టు ఏదో రేపటితో తేలిపోనుంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 374 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆ ఆధిక్యం రెండో సెషన్లో మరో 40 – 50 పరుగులకు పెరిగే అవకాశం ఉంది.
దాంతో, ఓవల్ మైదానంలో ఇంతవరకు అత్యధిక లక్ష్య ఛేదన ఎంత? అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఇప్పటివరకు ఇక్కడ 263 లక్ష్య ఛేదనే అత్యధికమని రికార్డులు చెప్తున్నాయి. 1902లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నిర్ధేశించిన 263 రన్స్ కొట్టింది. రెండో అత్యధిక ఛేదన వెస్టిండీస్ పేరు మీద ఉంది. విండీస్ జట్టు ఓవల్‌లో 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ స్టేడియంలో మూడో రికార్డు ఛేజ్ ఎంతంటే..? 242. రికార్డుల ప్రకారం అయితే.. ఈమైదానంలో 300 ప్లస్ లక్ష్యాన్ని ఏ జట్టు ఛేదించలేదు. మరి టీమిండియా బ్యాటర్లు అద్భుతం చేస్తారా? లేదా మ్యాచ్ అప్పగించేస్తారా? అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
తొలి ఇన్నింగ్స్‌లో పోరాడిన రహానే(89)
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలతో కదం తొక్కడంతో ఆసీస్ 469 వద్ద ఆలౌటయ్యింది. ఆ తర్వాత టీమిండియా ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్(14), విరాట్ కోహ్లీ(14) తక్కువకే వెనుదిరిగారు. కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(89), శార్దూల్ ఠాకూర్(51) పోరాడడంతో భారత్ 269 పరుగులు చేయగలిగింది.