WI vs PNG : పొట్టి ప్రపంచ కప్ 9వ సీజన్లో రెండో మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవనుంది. గయానా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్(West Indies)తో పసికూన పపువా న్యూగినియా(Papua New Guinea) తలడపడుతోంది. టాస్ గెలిచిన విండీస్ సారథి రొవ్మన్ పావెల్ బౌలింగ్ తీసుకున్నాడు. రెండుసార్లు చాంపియన్(2012, 2016) అయిన కరీబియన్ జట్టుకు ఆఫ్రికా జట్టు ఏమేరకు పోటీనిస్తుంది? అనేది ఆసక్తికరం.
వెస్టిండీస్ జట్టు : జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రొవ్మన్ పావెల్(కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, రొమారియో షెపర్డ్, రూథర్ఫర్డ్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ.
పపువా న్యూ గినియా జట్టు : టోనీ ఉరా, అస్సాద్ వలా(కెప్టెన్), సెసె బౌ, లెగా సైకా, హిరి హిరి, చార్లెస్ అమిని, కిప్లిన్ డొరిగ(వికెట్ కీపర్), అలే నవో, చాడ్ సోపర్, కబౌ మొరియా, జాన్ కరికో.