WI vs ENG | బార్బడోస్: స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1తో గెలుచుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా బుధవారం ముగిసిన నిర్ణయాత్మక మూడోవన్డేలో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (74), మోస్లీ (57) రాణించారు. ఛేదనను ఆతిథ్య జట్టు 43 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. కీస్ కార్టీ (128), బ్రాండన్ కింగ్ (102) శతకాలతో చెలరేగారు.