టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక, వెస్టిండీస్ మధ్య కొద్దిసేపట్లో పోరు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక ముందు బ్యాటింగ్‌కు దిగనుంది. వెస్టిండీస్ టీమ్‌లో ఎటువంటి మార్పు లేదు. శ్రీలంక టీమ్‌లో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. లాహిరు కుమార ప్లేస్‌లో బినురాను తీసుకున్నారు.
వెస్టిండీస్ టీమ్‌లో క్రిస్ గేల్, ఎవిన్ లీవిస్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), సిమ్రోన్ హెట్‌మైర్, కైరోన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రసెల్, జసన్ హోల్డర్, బ్రావో, అకీల్ హోసీన్, రవి రాంపాల్ బరిలో ఉన్నారు.
శ్రీలంక టీమ్‌లో పాథమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుకా రాజపక్సా, డాసన్ శనక(కెప్టెన్), చమిక కరునారత్నే, వానిండు హసరంగ, దుష్మంత చమీరా, మహీశ్ తీక్షణ, బినురా ఫెర్నాండో బరిలో ఉన్నారు.
Toss news from Abu Dhabi 🪙
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
West Indies will bowl first. #T20WorldCup | #WIvSL | https://t.co/Trhq8nBeY9 pic.twitter.com/rtvUeMtehi