WI vs PNG : గయానా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్(West Indies)బౌలర్లు చెలరేగుతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పసికూన పవువా న్యూ గినియా కష్టాల్లో పడింది. టాప్ బ్యాటర్లంతా 50 లోపే డగౌట్లో కూర్చున్నారు. ఓపెనర్ టోనీ ఉరా(2)ను షెపర్డ్ ఔట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అస్సాద్ వలా(21) ధనాధన్ ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
అయితే.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో అస్సాద్.. రోస్టన్ ఛేజ్ చేతికి దొరికాడు. ఆ తర్వాత స్పిన్నర్లు హొసెన్, మోతీలు తలొక వికెట్ తీసి పపువాను మరింత కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం సెస్ బౌ(22), చార్లెస్ అమిని(3)లు ఆడుతున్నారు. దాంతో, 10 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 57 రన్స్ కొట్టింది.