కింగ్స్టన్: వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రే రస్సెల్(Andre Russell) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇవాళ అతను తన చివరి టీ20 మ్యాచ్ ఆడేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆఖరి మ్యాచ్‌లో అతను చెలరేగిపోయాడు. 15 బంతుల్లో 36 రన్స్ చేసి అతను ఔటయ్యడు. 37 ఏళ్ల రస్సెల్ టీ20 కెరీర్లో 1122 రన్స్ చేశాడు. అతను 86 మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 163 స్ట్రయిక్ రేట్ ఉన్నది. రస్సెల్ తన టీ20 కెరీర్లో 61 అంతర్జాతీయ వికెట్లను తీసుకున్నాడు.
సబినా పార్క్ మ్యాచ్‌లో విండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 172 రన్స్ చేసింది. ఓ దశలో 98 రన్స్‌కే కీలకమైన అయిదు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను రస్సెల్ ఆదుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా చేధించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 16వ ఓవర్లో ఆ టార్గెట్‌ను అందుకున్నది. జోష్ ఇంగ్లిష్, కెమరూన్ గ్రీన్.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఆండ్రీ రస్సెల్ ఫీల్డింగ్‌కు వస్తున్న సమయంలో.. ఇరు జట్ల ఆటగాళ్లు అతని గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్నది. దీంతో సిరీస్ ఆసక్తికరంగా మారింది.
ANDRE RUSSELL SMASHED 4 SIXES & 2 FOURS IN 15 BALLS IN HIS FINAL INTERNATIONAL MATCH…!!! 🤯🔥 pic.twitter.com/5u6TwApm3K
— Johns. (@CricCrazyJohns) July 23, 2025