Alick Athanaze: కృనాల్ పాండ్యా రికార్డును సమం చేసిన విండీస్ బ్యాటర్
Alick Athanaze: వెస్టిండీస్ బ్యాటర్ అలిక్ అథనేజ్ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో భారత బ్యాటర్ కృనాల్ పాండ్యా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వన్డే అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
షార్జా: వన్డే అరంగేట్రం మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్ అలిక్ అథనేజ్(Alick Athanaze) రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో భారత బ్యాటర్ కృనాల్ పాండ్యా పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వన్డే అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. యూఏఈ జట్టుతో షార్జాలో జరిగిన మూడవ వన్డేలో.. వెస్టిండీస్ బ్యాటర్ అథనేజ్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతను 45 బంతుల్లో 65 రన్స్ చేశాడు. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో విండీస్ కైవసం చేసుకున్నది.
వెస్టిండీస్ క్రికెటర్ అథనేజ్ దూకుడు బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. బ్రియాన్ లారాకు అభిమాని అయిన అథనేజ్.. మాజీ విండీస్ దిగ్గజం స్టయిల్లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టయిలిష్ స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. 2021లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కృనాల్ రికార్డును ఇప్పుడు అధనేజ్ సమం చేశాడు.
🚨WORLD RECORD🚨
Alick Athanaze has equaled the fastest half-century on ODI debut!🤯#MenInMaroon #UAEvWI pic.twitter.com/MqlgaLTSd5
— Windies Cricket (@windiescricket) June 9, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

