అంటిగ్వా: వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం గురువారం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సారథ్యంలో 15 మందితో కూడిన కరీబియన్ బృందం భారత్‌లో పర్యటించనుంది. సీనియర్ ఆటగాళ్లు కిమారో రోచ్, బ్రాండన్ కింగ్‌కు అవకాశం దక్కగా.. యువ ప్లేయర్ బొన్నర్కు చోటు లభించింది. ఫిబ్రవరి 6 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో వన్డే సిరీస్ జరుగనుంది. కలకత్తా వేదికగా ఫిబ్రవరి 16 నుంచి జరుగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు.
వెస్టిండీస్ జట్టు
పొలార్డ్ (కెప్టెన్), అలెన్, బొన్నర్, బ్రావో, బ్రూక్స్, హోల్డర్, హోప్, అకీల్, జోసెఫ్, బ్రాండన్ కింగ్, పూరన్, రోచ్, షెఫర్డ్, ఓడెన్ స్మిత్, జూనియర్ హేడన్ వాల్ష్.