ఫొటోల కోసం సునీల్ ఛెత్రిని పక్కకు తోసేసిన బెంగాల్ గవర్నర్.. నెటిజన్ల ఆగ్రహం
ఫొటోలకు ఫోజులివ్వడం కోసం పశ్చిమబెంగాల్ గవర్నర్ లా గణేషన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. టీమిండియా ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రిని పక్కకు తోసేస్తూ గణేషన్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా..?
ఫొటోలకు ఫోజులివ్వడం కోసం పశ్చిమబెంగాల్ గవర్నర్ లా గణేషన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. టీమిండియా ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రిని పక్కకు తోసేస్తూ గణేషన్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా..? అని గణేషన్పై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..
భారత్లో అత్యంత ప్రాచీనమైన ఫుట్బాల్ టోర్నీ అయిన డ్యూరాండ్ కప్ (131వ) ఫైనల్లో సునీల్ ఛెత్రి సారథ్యం వహిస్తున్న బెంగళూరు ఫుట్బాల్ క్లబ్.. 2-1 తేడాతో ముంబై సిటీపై గెలిచింది. ఆదివారం కోల్కతా వేదికగా ముగిసిన ఈ మ్యాచ్లో విజేతలకు ట్రోఫీని అందించడానికి వెస్ట్ బెంగాల్ గవర్నర్ (ఇంచార్జి) లా గణేషన్ కూడా వచ్చారు.
అయితే ట్రోఫీ అందజేసేప్పుడు వేదికమీద గవర్నర్తో పాటు స్థానిక మంత్రులు, క్రీడాకారులు ఉన్నారు. ట్రోఫీని అందజేస్తూ గణేషన్.. ఫొటోలు తీస్తున్నవారికి అడ్డుగా ఉన్నాడని ఛెత్రిని పక్కకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. గణేషన్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఫుట్బాలర్ల జాబితాలో సునీల్ ఛెత్రి ప్రస్తుతం ఐదో స్థానం (84 గోల్స్) లో ఉన్నాడు. దిగ్గజ ఆటగాళ్లు మెస్సీ (86), క్రిస్టియానో రొనాల్డో (117) ఛెత్రికంటే ముందున్నారు. అంతటి ఖ్యాతిగాంచిన ఛెత్రితో గవర్నర్ ఇలా వ్యవహరించడం సరికాదని, ఇది సిగ్గుచేటు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ‘ఇది అవమానకరం’ అని కామెంట్ చేశాడు.
WB Governor pushing away captain Sunil Chhetri the winner of Durand cup 2022 to stay in the limelight.
The captain should have walked away pic.twitter.com/kqAPGxjx5j
— Rocks (@naikrakesh) September 19, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

