జైపూర్ : పారిస్ వేదికగా జరుగనున్న పారాలింపిక్స్‌లో 25కు పైగా పతకాలు సాధిస్తామని భారత పారాలింపిక్ కమిటీ(పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి మొదలుకాబోతున్న పారాలింపిక్స్‌లో భారత్ 84 మందితో కూడిన భారీ బృందంతో బరిలోకి దిగబోతున్నది. గత టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు గెలిచిన భారత బృందం..ఆసియా పారాగేమ్స్‌లో 111 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. మంగళవారం మీడియా సమావేశంలో దేవేంద్ర మాట్లాడుతూ ‘పారిస్ పారాలింపిక్స్‌లో భారత ప్లేయర్లు మొత్తం 12 విభాగాల్లో పోటీపడుతున్నారు. మెగాటోర్నీ కోసం అథ్లెట్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. కచ్చితంగా 25కు పైన పతకాలు గెలుస్తామన్న నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, షూటింగ్లో మంచి ఫలితాలు వస్తాయి.