మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో భారత్ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతంగా పోరాడుతున్నారు. 221కే 7 వికెట్లు కోల్పోయిన దశలో జట్టుకు ఫాల్ ఆన్ తప్పదా అనే దశ నుంచి 400 రన్స్ దిశగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు అర్ధశతకాలు నమోదుచేశారు.
నితీశ్ రెడ్డి 81 బాల్స్‌లో 50 రన్స్ చేయగా, సుందర్ 152 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో సుందర్ తన టెస్టు కెరీర్లో 4 అర్ధసెంచరీలు నమోదుచేశాడు. ఇక ఆసీస్‌పై తగ్గేదే లేదంటూ జోరుమీదున్న నితీశ్ రెడ్డి సెంచరీ (95) మార్కుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలో ఈ తెలుగు బ్యాటర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం భారత్ 7 వికెట్లు కోల్పోయి 345 రన్స్ చేసింది. మరో 128 రన్స్ చేస్తే మొదటి ఇన్నింగ్స్‌లో లీడ్‌లోకి వస్తుంది. ఇంకా బుమ్రా, సిరాజ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.
FIFTY!
A fantastic and a hard fought half-century for @Sundarwashi5 👏👏
His 4th in Test cricket!
Keep going, Washi 🙌🙌
Live – https://t.co/MAHyB0FTsR……… #AUSvIND pic.twitter.com/nsU6m4vPrJ
— BCCI (@BCCI) December 28, 2024