Robin Uthappa | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 వరల్డ్ కప్ జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు అవకాశం దక్కకపోవడానికి విరాట్ కోహ్లీయే కారణమని ఆరోపించాడు. అతని కెరియర్ నాశనం అవడానికి కారణం విరాట్ కారణమని వ్యాఖ్యానించాడు. రాయుడు అంటే కోహ్లీకి నచ్చదని.. అందుకే 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించినట్లుగా ఊతప్ప తెలిపాడు. ఆ వరల్డ్ కప్ జట్టులో రాయుడికి ఎంపికయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే, జట్టును ప్రకటించిన సమయంలో పేరు మాత్రం కనిపించలేదు. దాంతో మనస్థాపానికి గురైన రాయుడు ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెటర్ నుంచి గుడ్‌బై చెప్పాడు. అతని స్థానంల్ ఆల్‌రౌండ్ విజయ్ శంకర్‌కు అవకాశం ఇచ్చింది. అతను బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేయగల త్రీడీ ప్లేయర్ అంటూ అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రెస్మీట్లో పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూ రాబిత్ ఊతప్ప మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీకి ఎవరైనా నచ్చకపోయినా అతన్ని పక్కనపెట్టేస్తాడని.. తనకు సరిగా అనిపించకపోయినా అవకాశాలు ఇవ్వడని.. అందుకు అంబటి రాయుడు ఉదాహరణ అని తెలిపాడు. ప్రతి ఆటగాడు ఈ స్థాయికి వచ్చేందుకు కష్టపడి పని చేస్తాడని.. అయితే, ప్రతి ఒక్కరికీ సొంత ప్రాధాన్యతలు ఉంటాయని.. వాటిని తాను సైతం అంగీకరిస్తానని.. కానీ, అవకాశాలు లేకుండా చేయడం ఏమాత్రం సరికాదని ఊతప్ప పేర్కొన్నాడు. రాయుడికి ప్రపంచకప్ జెర్సీలతో పాటు కిట్‌ను సైతం అందించారని.. అంతా సిద్ధమైపోయిన వేళ.. ఏ క్రికెటర్ అయినా ప్రపంచకప్‌లో ఆడుతామనే అనుకుంటారని.. కానీ, రాయుడిని ఎంపిక చేయకుండా కోహ్లీ అడ్డుకున్నాడని.. అదిమాత్రం తనకు ఏమాత్రం నచ్చలేదని ఊతప్ప చెప్పాడు.
అయితే, రాయుడిని ఇంటికి పంపి.. ముఖంపైనే జట్టులోకి రాకుండా తలుపులు మూసేయడం తప్పు, అన్యాయమని తెలిపాడు. ఇలాంటి నిర్ణయాలు మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయని అర్థం చేసుకోవాలన్నాడు. నిర్ణయంతో ఒకరి విశ్వాసంపై దెబ్బతీశారని.. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఏంటీ? అంటూ ప్రశ్నించాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో తనకు చోటు సెలక్షన్ కమిటీ వల్లే తనకు చోటు దక్కలేదని గతంలో అంబటి రాయుడు ఆరోపించాడు. ఎమ్మెస్కే ప్రసాద్ కారణంగా అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అయితే, తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెస్కే ఖండించాడు. రాయుడు తనను అపార్థం చేసుకున్నాడని.. సెలెక్టర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.