బెంగుళూరు: ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్‌రౌండర్ హసరంగను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు సొంతం చేసుకున్నది. అతన్ని 10.75 కోట్లకు ఆ టీమ్ ఖరీదు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో హసరంగ బిడ్డింగ్ జరిగింది. అయితే అనూహ్య రీతిలో లంక క్రికెటర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. వాషింగ్టన్ సుందర్‌ను 8.75 కోట్లకు హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్నది.