అడిలైడ్: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్.. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవగా.. ద్రవిడ్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో లక్ష్మణ్ నేతృత్వంలో హృషికేశ్ కనిత్కర్ (బ్యాటింగ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్) బృందం.. టీమ్ఇండియాతో కలిసి పనిచేయనుంది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ఇండియా మూడు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. నవంబర్ 18 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుండగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే.