హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్షిప్-2024లో వ్రితి అగర్వాల్, సుహాస్ ప్రీతమ్ చాంపియన్లుగా నిలిచారు. సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోటీలలో భాగంగా మహిళల విభాగంలో రంగారెడ్డికి చెందిన అగర్వాల్.. 200, 400, 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో అగ్రస్థానంతో మెరిసింది.
పురుషుల విభాగంలో 50, 100, 200 మీటర్ల బ్యాక్ విభాగాల్లో సుహాస్ విజేతగా నిలిచాడు. అంతేగాక 200, 400 మీటర్ల వ్యక్తిగత పతక విభాగాల్లోనూ మొదటి స్థానంతో చాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు.