Virdhawal Khade : భారత స్టార్ స్విమ్మర్ విర్ధావల్ ఖడే ఈత కొలనుకు గుడ్ బై చెప్పేశాడు. గోవాలో జరుగుతున్న 37వ నేషనల్ గేమ్స్(National Games 2023)లో బంగారు పతకంతో రికార్డు సృష్టించిన విర్ధావల్.. రిటైర్మెంట్ నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 32 ఏండ్ల విర్ధావల్ 22.82 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
‘ఈ మెడల్ నాకెంతో ప్రత్యేకం. 2001లో ఇక్కడే మొదటి నేషనల్మెడల్ సాధించాను. ఇప్పుడు బంగారు పతకం గెలవడంతో నా జీవితం పరిపూర్ణం అయింది. ఇంకొన్ని రోజులు ఈతకొలనులో పోటీ పడాలని ఉన్నప్పటికీ నా శరీరం అలసిపోయింది’ అని విర్ధావల్ తెలిపాడు. అంతేకాదు భవిష్యత్తులో తనను కోచ్‌గా చూసినా ఆశ్చర్యపోనవసరం లేదని వెల్లడించాడు.
విర్ధావల్ 16వ ఆసియా క్రీడల్లో 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో కాంస్యం పతకంతో మెరిశాడు. 2018 ఆసియా క్రీడల 4 x100 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగం ఫైనల్లో జాతీయ రికార్డు బద్ధలు కొట్టాడు. దక్షిణాసియా పోటీల్లో వెండి పతకం సాధించాడు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో విర్ధావల్ ఆరో స్థానంలో నిలిచాడు.