Virat Kohli | టీంఇండియా (Team India) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా (Worldwide) అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఈ రన్‌మెషీన్. కోహ్లీ (Kohli) మైదానంలో బ్యాట్ పట్టాడంటే అందరి కళ్లు అతని వైపే ఉంటాయి. కాగా మరో రెండు రోజుల్లో ఆసియా కప్ (Asia Cup 2023) ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ (Virat New Look) కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup 2023) మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్, మాజీ కెప్టెన్ విరాట్ కొత్త హెయిర్ కట్ (Virat New Hair Cut)తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసిన అభిమానులు ‘వావ్..’, ‘కోహ్లీ న్యూ లుక్ సూపర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Virat Kohli’s new look for Asia Cup 2023.
||#INDvsPAK |#AsiaCup2023 |#ViratKohli|| pic.twitter.com/5Q4pSANmdq
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023
Virat Kohli in the new looks ahead of Asia Cup 2023. pic.twitter.com/Wv9qRwkhOL
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2023
ఈ ఏడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో జరుగనుంది. ఆగస్టు 30న మొదలయ్యే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక (Aisa Cup Venues) ఆతిథ్యం ఇస్తున్నాయి. నిరుడు చాంపియన్‌గా నిలిచిన లంక (Srilanka) ఈసారి కూడా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే.. భారత్, పాకిస్థాన్ కూడా ఈ టోర్నీ కోసం గట్టిగానే సన్నద్ధమవుతున్నాయి. దాంతో, ఈసారి విజేతగా ఎవరో ఊహించడం కొంచెం కష్టమే.