Virat Kohli | బెంగళూరు: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఫైర్ సేఫ్టీ విషయంలో సదరుశాఖ నుంచి ఎన్వోసీ లేని కారణంగా బెంగళూరు బృహత్ మహానగర పాలికె(బీబీఎమ్‌పీ) కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసింది.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని బీబీఎమ్‌పీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. నోటీసులకు రెస్టారెంట్ యాజమాన్యం నుంచి ప్రతిస్పందన రాలేదని, ఏడు రోజుల్లోగా రాకపోతే లీగల్ యాక్షన్ తీసుకంటామని బీబీఎమ్‌పీ అధికారులు పేర్కొన్నారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఆరో అంతస్తులో కోహ్లీ రెస్టారెంట్ నడుస్తున్నది.