Virat Kohli | ఆస్ట్రేలియా పర్యటనలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరుగులు చేయకుండానే అవుటయ్యాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తొలిసారిగా మళ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి తిరిగి వచ్చిన కోహ్లీ.. మూడు వన్డేల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లో విఫలమయ్యాడు. అడిలైడ్‌లో జరిగిన వన్డేలో కోహ్లీ అవుట్ అయ్యాక పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో ప్రేక్షకులకు అభిమానం చేశాడు. దాంతో కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే చర్చ మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశంపై చర్చ సాగుతున్నది.
వాస్తవానికి 2027లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ వరకు వన్డే క్రికెట్లో కొనసాగాలని విరాట్ భావిస్తున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. తన వన్డే కెరీర్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ డకౌట్ అవడం ఇదే తొలిసారి. అడిలైడ్ కోహ్లీ రికార్డు బాగుంది. అయితే, ఈ సారి మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయింది. జేవియర్ బార్ట్లెట్ తన రెండో ఓవర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను.. ఆ తర్వాత కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు. బార్ట్లెట్ అప్పీల్ చేయగా.. అంపైర్ కోహ్లీని అవుట్‌గా ప్రకటించారు.
విరాట్ డీఆర్ఎస్కు వెళ్లాలని భావించగా.. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ డీఆర్ఎస్ వద్దని చెప్పాడు. రోహిత్ సలహా మేరకు విరాట్ పెవిలియన్ వైపు కదిలాడు. దాంతో అభిమానులు అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వస్తున్న సమయంలో చేయి ఊపుతూ ప్రేక్షకుల శుభాకాంక్షలు స్వీకరించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కోహ్లీ అవుట్ అయిన తర్వాత పెవిలియన్‌కు వచ్చే సమయంలో చేయి పైకెత్తి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. దాంతో పలువురు కోహ్లీ రిటైర్మెంట్కు ముడిపెడుతున్నారు. రిటైర్మెంట్ గురించి హింట్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. విరాట్ ఇప్పటికే టీ20 క్రికెట్‌తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నాడు.
VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T
— cricket.com.au (@cricketcomau) October 23, 2025