ICC ODI World Cup | వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ (India vs Aus) కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ (Virat Kolhi), కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. తొలి మూడు వికెట్లు టపటపా పడిపోయినా.. కోహ్లీ, రాహుల్ సంయమనంతో ఆడుతూ.. జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 116 బంతులకు 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. హాజిల్ వుడ్ బౌలింగ్ లో లబుషేన్ కి క్యాచ్ ఇచ్చి కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ ఔటయిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఫ్రస్టేషన్లో కోహ్లీ తల బాదుకుంటూ కనిపించాడు. ఇలాంటి కీలక సమయంలో అవుటైనందుకు చాలా చికాకు పడిపోయాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli was looking very angry, sad and frustrated at same time💔#INDvsAUS #ViratKohli pic.twitter.com/p9Jy1BTk8I
— Abhishek (@Abhishekkk_k) October 8, 2023