సిడ్నీ: విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మాథ్యూ షార్ట్ బలంగా కొట్టిన బంతిని అందుకున్నాడు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న కోహ్లీ చేతుల్లోకి నేరుగా ఆ బంతి వెళ్లింది. సుందర్ బౌలింగ్‌లో భారీ స్వీప్ షాట్ ఆడాడు షార్ట్. అయితే స్క్వేర్ లెగ్‌లో ఉన్న కోహ్లీ .. తన వైపు దూసుకువస్తున్న బంతిని తడబడకుండా అందుకున్నాడు. తన శరీరాన్ని కిందకు వంచుతూ.. ఎటువంటి పొరపాటు చేయకుండా కోహ్లీ ఆ క్యాచ్ పట్టేశాడు. కోహ్లీ పట్టిన ఆ క్యాచ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. షార్ట్ 41 బంతుల్లో 30 రన్స్ చేసి నిష్క్రమించాడు.
What a special catch that is from Virat Kohli ✨
Follow #AUSvIND: https://t.co/YH5IbBTdsc pic.twitter.com/EcAya9tviT
— cricket.com.au (@cricketcomau) October 25, 2025
దీనికి ముందు ఓపెనర్ మిచెల్ మార్ష్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అక్షర్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ ఔటయ్యాడు. మార్ష్ 41 రన్స్ స్కోర్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో అయిదు బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి.
Huge wicket from Axar Patel! Mitch Marsh looked settled but he now departs.
Follow #AUSvIND: https://t.co/YH5IbBTdsc pic.twitter.com/BJjoVZpfGK
— cricket.com.au (@cricketcomau) October 25, 2025
తాజా సమాచారం ప్రకారం భారత్‌తో సిడ్నీలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. నాథన్ ఎల్లిస్, కూపర్ కూన్లే ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.