పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు.. భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నది. పెర్త్‌లో ఇండియా-ఏ జట్టుతో తలపడుతున్న సీనియర్ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధం అవుతోంది. అయితే ఇవాళ ప్రారంభమైన 3 రోజుల మ్యాచ్‌లో.. సీనియర్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఇటీవల ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli).. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పేలవంగా ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 15 రన్స్ చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ అతను విఫలమైన విషయం తెలిసిందే. ఇవాళ్టి ప్రాక్టీస్ మ్యాచ్‌లో మరో స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
కవర్ డ్రైవ్‌లతో ఆరంభంలో ఆకట్టుకున్న కోహ్లీ.. ఆ తర్వాత ఓ స్వింగ్ బంతికి .. సెకండ్ స్లిప్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. కోహ్లీ వికెట్‌ను ముకేశ్ కుమార్ తన ఖాతాలో వేసుకున్నాడు. రిషబ్ పంత్ 19 పరుగులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నితీశ్ కుమార్ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా తక్కువ రన్స్ చేశాడు. అతను 15 పరుగులకే ఔటయ్యాడు. కోహ్లీ ఔటైన వెంటనే మైదానం విడిచి వెళ్లి మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆరంభంలో రిషబ్ బాగానే ఆడినా.. షార్ట్ పిచ్ బంతులతో బౌలర్లు టార్గెట్ చేయడంతో అతను ఔటయ్యాడు.