IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హాఫ్ సెంచరీ బాదాడు. 16వ ఇన్నింగ్స్లో ఎట్టకేలకు అర్ధ శతకం కొట్టాడు. దాంతో, 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్లో తొలిసారి అతను యాభై పరుగులకు చేరువయ్యాడు. లియన్ ఓవర్లో రెండు రన్స్ తీసి ఫీఫ్టీ మార్క్ అందుకున్నాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తో కలిసి నాలుగో వికెట్కు 26 పరుగులు జోడించాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ 128 పరుగుల వద్ద లియాన్ ఓవర్లో ఔట్ అయ్యాడు. దాంతో, భారత్ 245 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 271/3. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 209 పరుగులు వెనకబడి ఉంది.
రోహిత్ శర్మ ఔటయ్యాక గిల్, పూజారాతో కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ స్పిన్ త్రయాన్ని ధీటుగా ఎదుర్కొన్న గిల్ టెస్టుల్లో రెండో శతకం సాధించాడు. పూజారాతో మూడో వికెట్కు 58 పరుగులు జోడించాడు. గిల్ వెనుదిరిగాక.. విరాట్ కోహ్లీ, జడేజా ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. కోహ్లీ ఫిఫ్టీ బాదడంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో భారత్ ధీటుగా బదులిస్తోంది.