Virat Kohli : ఐపీఎల్లో తొమ్మిదో శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట చూస్తుంటే మరో రెండేళ్లు అతడికి తిరుగులేదని అనిపిస్తోంది. వరసగా రెండు గోల్డెన్ డకౌట్ల నుంచి తేరుకొని సెంచరీతో విరుచుకుపడిన కోహ్లీ వన్డే వరల్డ్ కప్‌లో ఇలానే ఆడితే చూసి తరించాలని అభిమానులు అనుకుంటున్నారు. విరాట్ సైతం ప్రపంచకప్ ఆడాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘దేశం తరఫున వరల్డ్‌కప్ ఆడడం కంటే గొప్ప విషయం ఏముంటుంది’ అని కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు.. వన్డేల్లో శతకాల ఫిఫ్టీతో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ తదుపరి లక్ష్యం? ఏంటో తెలుసా.. వన్డే ప్రపంచ కప్. ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్‌తో ఆర్సీబీ కలను సాకారం చేసిన విరాట్ వచ్చే ఏడాది ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన, ఆపై స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో శతకాలతో రెచ్చిపోయిన అతడు.. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ దంచేశాడు. ఇప్పుడు ఐపీఎల్ 19లోనూ కుర్రాడిలా రెచ్చిపోతున్నాడు. అతడి ఫామ్ చూస్తుంటే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కప్ ఆడేలా ఉన్నాడు? అని అందరూ అనుకుంటున్నారు. ఇదే విషయంపై ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నాకు ప్రపంచకప్ ఆడాలనే ఉంది అని మనసులోని మాట చెప్పేశాడు.
🔊 Virat Kohli answers the big 2027 question 👇 pic.twitter.com/xsW6w7cxft
— Cricbuzz (@cricbuzz) May 15, 2026
‘మైదానంలోకి దిగాక జట్టులో ఉత్సాహం నింపడం, విజయంలో భాగమవ్వడం మీదే నా దృష్టంతా ఉంటుంది. నన్ను నేను నిరూపించుకోవాలని ఆడను. నేను ఇప్పుడు ఆ పరిస్థితిలో లేను కూడా. ఎందుకంటే మ్యాచ్ సన్నద్ధత పట్ల, మైదానంలోకి దిగాక ఎలా ఆడాలి? అనే విషయాల పట్ల నేను నిజాయతీగా ఉంటాను. అందుకని తల కిందకు వంచి.. నెట్స్‌లో కష్టపడతాను. నా క్రికెట్ కెరీర్లో అన్నీ ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. నాకు అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వపడతాను. ఇక ఆట విషయానికొస్తే.. వన్డేల్లో 40 ఓవర్ల పాటు బౌండరీ నుంచి అవతలి బౌండరీ వరకూ పరెగెత్తమని చెప్పినా.. నేను పరుగెడుతాను.
Virat Kohli on playing World Cup 2027 👀#viratkohli #cricket #rcbpic.twitter.com/Yz3GxaZSjC
— CREX (@Crex_live) May 15, 2026
యాభై ఓవర్లకు తగ్గట్టుగా నేను సన్నద్ధమవుతా. నేను ఎదుర్కొనే ప్రతి బంతిని ఇదే నా కెరీర్లో చివరి బంతి అనుకుంటూ బ్యాటింగ్ కొనసాగిస్తా. అంతేనా.. వికెట్ల మధ్యలో చకచకా పరుగుతీస్తా. జట్టుకు అవసరమైన ప్రతిదీ చేసేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే. విజయ్ హజారే ట్రోఫీలో గొప్పగా ఆడాను. వరల్డ్‌కప్ గురించి అడిగితే.. నాకూ ఆడాలనే ఉంది. కానీ, అది నా ఒక్కడి నిర్ణయం సరిపోదు. జట్టుకు కూడా నా అసవరం ఉందని సెలెక్టర్లు అనుకోవాలి. అప్పుడే వరల్డ్‌కప్ ఆడగలను’ అని విరాట్ పేర్కొన్నాడు.

రెండేళ్ల క్రితం టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్.. ప్రస్తుతం అంతర్జాతీయంగా వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2011లో ధోనీ సారథ్యంలో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన విరాట్.. ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ కీలకమయ్యాడు. అదే ఉత్సాహంతో 2027 వన్డే ప్రపంచకప్ ఆడి దేశానికి మరో ఐసీసీ ట్రోఫీ కట్టబెట్టాలని అతడు ఆశపడుతున్నాడు. అయితే.. మన సెలెక్టర్లు ఏం చేస్తారో చూడాలి.