Virat Kohli | కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన విరాట్ కోహ్లీ.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Virat Kohli | టీంఇండియా (Team India) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా (Worldwide) అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. కాగా, తాజాగా విరాట్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు.
Virat Kohli | టీంఇండియా (Team India) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా (Worldwide) అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఈ రన్‌మెషీన్. కోహ్లీ (Kohli) మైదానంలో బ్యాట్ పట్టాడంటే అందరి కళ్లు అతనివైపే ఉంటాయి. కాగా, తాజాగా విరాట్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ (IPL) సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కొత్త హెయిర్ కట్ (New Hair Cut )తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసిన అభిమానులు ‘వావ్..’, ‘కోహ్లీ న్యూ లుక్ సూపర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ (Famouse Hair stylist) ఆలిమ్ హకీమ్ (Aalim Hakim).. కోహ్లీకి ఈ కొత్త రూపాన్ని అందించారు. ఆలిమ్ ఒక్క కోహ్లీకే కాదు చాలా మంది సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆలిమ్ బాలీవుడ్ తారలు, క్రికెట్ సెలబ్రిటీలతో పరిచయాలు ఎక్కువ. కాగా, తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీకి సూపర్ హెయిర్ స్టైల్ సెట్ చేసిన ఆలిమ్‌కు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు.
మార్చి 31 నుంచి చెన్నై-గుజరాత్ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ టైటిల్ వేట ఆరంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఐపీఎల్ వేటకు సిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.
Also Read..
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్‌సభ సభ్యత్వం రద్దు
Manchu Brothers | మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు.. మనోజ్ అనుచరుడిపై విష్ణు దాడి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Aalim Hakim
- ipl
- RCB
- Virat Kohli
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

