Manchu Brothers | మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు.. మనోజ్ అనుచరుడిపై విష్ణు దాడి
Manchu Brothers | మంచు (Manchu) సోదరులు మనోజ్ (Manchu Manoj), విష్ణు (Manchu Vishnu) మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు బ్రదర్స్ (Manchu Brothers) కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మంచు మనోజ్ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది.
Manchu Brothers | మంచు (Manchu) సోదరులు మనోజ్ (Manchu Manoj), విష్ణు (Manchu Vishnu) మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వారి మధ్య విభేదాలు ఉన్నట్లు ఎక్కడా బాహాటంకాలేదు. ఇటీవల మనోజ్ (Manchu Manoj) రెండో వివాహం భూమా మౌనిక రెడ్డితో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహం మనోజ్ తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) , ఇతర కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం లేదని.. అందుకే మనోజ్ వివాహం సోదరి మంచు లక్ష్మి తన నివాసంలోనే అంతా తానై దగ్గరుండి జరిపించిందంటూ ప్రచారం జరిగింది. వివాహ వేడుకలో కూడా మంచు విష్ణు దంపతులు అంటీముట్టనట్టు కనిపించారు. ఈ పరిణామంతో మంచు కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు అంతా మాట్లాడుకున్నారు.
ఈ నేపథ్యంలో మంచు బ్రదర్స్ (Manchu Brothers) కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మంచు మనోజ్ అనుచరుడైన సారధిపై విష్ణు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను మనోజ్ స్వయంగా సోషల్‌మీడియా వేదికగా షేర్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ‘ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి’ అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. తన అనుచరుడు సారధి ఇంటికి వెళ్లి అతడిపై మంచు విష్ణు దాడి చేసినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోజ్ ఫేస్బుక్, ఇన్‌స్టా స్టోరీస్‌లో స్టేటస్‌గా పెట్టి.. కొద్దిసేపటి తర్వాత తొలగించాడు.
Also Read..
Pradeep Sarkar | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Salaar | సలార్‌లో నో సాంగ్స్, నో కామెడీ.. క్రేజీ టాక్‌లో నిజమెంత?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

